తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలను నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు.. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాల్కల్ రోడ్డులోని ఎస్సీ బాయ్స్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో బుధవారం వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా టిఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మారం అవిన్ కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ: మంత్రి లక్ష్మణ్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మంత్రి గారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. నిరంతరం పీడిత వర్గాల అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన కృషి చేస్తున్నారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రఘు మాదిగ, శ్రీకాంత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
