HomeTelanganaNizamabadక్రమశిక్షణ ఉల్లంఘించిన నేతపై సస్పెన్షన్ వేటు

క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతపై సస్పెన్షన్ వేటు

క్రమశిక్షణ ఉల్లగించిన మాజీ రాష్ట్ర యన్ యస్ యూ ఐ ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణు రాజ్, 48వ డివిజన్ మాజీ ప్రెసిడెంట్ పుండ్ర సాయి కుమార్, మాజీ NSUI జిల్లా నాయకులు నరేన్ దీప్ పార్టీ క్రమశిక్షణాలను ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేసి నట్లు అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ స్పష్టం చేసారు

ఏఐసిసి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్ష జరుగుతున్న సమయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ రాష్ట్ర విత్తనభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు జీవి రామకృష్ణ పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్ లతో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో వరదబట్టు వేణు రాజ్, పుండ్ర సాయికిరణ్, నరేన్ దీప్ మరియు ఇంకొంతమంది వారి వ్యక్తిగత కార్యచరణను దృష్టిలో పెట్టుకొని యువజన కాంగ్రెస్ కార్యక్రమాన్ని అంతరాయం కలిగించే విధంగా అక్కడ ఉన్న నాయకులతో వాగ్వివాదాం పెట్టుకున్న సమయంలో హెచ్చరించిన వినకుండా తాను అనుకున్న కార్యక్రమాన్ని చేసి పార్టీ క్రమశిక్షణాలను ఉల్లంఘించడం జరిగింది.

ఇదంతా ఇద్దరు జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర నాయకత్వం ఎదుట ప్రత్యక్షంగా జరగటం వల్ల ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా వారిపై చర్యలు తీసుకున్నట్లు రామకృష్ణ పేర్కొన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments