Thursday, April 16, 2026
HomeHEALTHముగిసిన ఐ డి ఓ సి ఉద్యోగులకు జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు

ముగిసిన ఐ డి ఓ సి ఉద్యోగులకు జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు

ఈరోజు ఐడిఓసి ఉద్యోగులకు జీవన శైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షల మూడవ రోజు ఆరోగ్య శిబిరాలను జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ గారు పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా డి ఎం హెచ్ ఓ గారు మాట్లాడుతూ ఐడి ఓసి లో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులు సుమారు 800 అందరూ జీవనశైలి వ్యాధులైన హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ మొదలగు వ్యాధులకై నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని తెలియజేశారు.

ప్రతి ఉద్యోగి తన జీవన శైలిలో మార్పులను చేసుకుంటూ గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ లాంటి వ్యాధులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యం పై హెల్త్ వీక్ నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవంపై అవగాహన సదస్సు నిర్వహించుకోవడం జరిగిoదన్నారు.

దీనికోసం చక్కని పోషకాహారం, సిరి ధాన్యాలు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే వాడాలి అన్నారు .ఈ సందర్భంగా ఉద్యోగుల కోసం సిరి ధాన్యాలు మరియు గానుగ నూనెలతో కూడిన మిల్లెట్ మేళాను కూడా నిర్వహించడం జరిగింది అన్నారు.

ఇంకా ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించడమే కాకుండా మొబైల్ హ్యాండిల్ ఎక్స్రే మిషన్ ద్వారా ఎక్స్రే నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఈరోజు నాలుగు వైద్య బృందాల చేత ఉద్యోగుల కోసం జీవన శైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలను 72 మంది ఉద్యోగులకు నిర్వహించడం జరిగిందని ఇందులో పురుషులు 56 మహిళలు16 మంది ఉద్యోగులు ఉన్నారని అన్నారు.

ఈరోజు నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా హైపర్ టెన్షన్ 08 మందిలో గుర్తించడం జరిగిందని, మధుమేహాన్ని 0 మందిలో గుర్తించడం జరిగిందన్నారు. వీరిలోఉన్నత వైద్య సేవల కోసం 8 మంది నీ రిఫర్ చేయడం జరిగిందన్నారు.

అదేవిధంగా క్షయ వ్యాధి నిర్ధారణలో భాగంగా 29 మంది ఉద్యోగులకు ఎక్స్రే తీయడమే కాకుండా వారిలో ఎవరిని కూడా కొత్తగా క్షయ వ్యాధి బాధితులుగా గుర్తించడం జరిగలేదన్నారు. మూడు రోజుల్లో మొత్తం 451 మంది ఉద్యోగులకు నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో పురుషులు 301, మహిళలు 150 ఉండగా, కొత్తగా 25 మందిలో హైపర్ టెన్షన్ ను, 12 మందిలో మధుమేహాన్ని, 10 మందినీ నూతన క్షయ వ్యాధి గ్రస్తులుగా గుర్తించడం జరిగింది

అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి ఎన్సీడీ డాక్టర్ వెంకన్న, డీఎస్ఓ డాక్టర్ వెంకటేష్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ అశ్విని, వైద్యులు డాక్టర్ సంజీవరెడ్డి, డాక్టరు భాస్కర్, డాక్టర్ అజ్మల్ ,డాక్టర్ కావ్య, డాక్టర్ నవ్య ,డాక్టర్ అవంతి, డి పి సి వెంకటేశం, డి హెచ్ ఈ ఘన్ పూర్ వెంకటేశ్వర్లు, టీబీ కోఆర్డినేటర్స్ రవి గౌడ్, లక్ష్మణ్ ,నరేష్,ఎం ఎల్ హెచ్ పి లు కవిత, అంకితా కులకర్ణి, డాక్టర్ నజీబ్ ,డాక్టర్ సంతోష్, పర్యవేక్షణ అధికారులు మధుకర్, రవీందర్, శ్యామల ఏఎన్ఎంలు ,ఆశాలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!