ది ఎడిటర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కానుకంటి శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశoలో నిరంతర జ్వాల పత్రిక ఎడిటర్ కానుకంటి శివప్రసాద్ను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్షులు సింగోజు దేవిదాస్ తెలియజేశారు.
ఈ సందర్భంగా కానుకంటి శివప్రసాద్ మాట్లాడుతూ పత్రికా నిర్వహణ భారం అవుతున్న నేటి తరుణంలో వృత్తికి అంకితమై పని చేస్తూ అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుంటూ పత్రిక నడిపించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న మీరందరికి శుభాభివందనాలు తెలియజేశారు.
ఎడిటర్స్ అసోసియేషన్ విధుల నిర్వహణకు, పత్రికల ప్రజాదరణకై మరింత ముందడుగు వేయడానికి ఎప్పటికప్పుడు మీ సహాయ సహకారాలు అవసరమైనదిగ భావిస్తున్నాను.
మనందరి ఐక్యతతో పత్రిక నిర్వహణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజా సమస్యల పరిష్కారానికి బాధ్యతలను మీద వేసుకొని కొత్త మార్గాలను అన్వేషించుకుంటూ చిన్న పత్రికల యొక్క సత్తా చాటడానికి ఈ అసోసియేషన్ అంకితభావం గా పని చేయాలని ఆశిస్తున్నాను.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త సామాజిక సేవా కార్యక్రమాలను ఎన్నుకొని కలానికి మరింత పదును పెంపొందించుకోవాలని,అందుకోసం మన అందరం ఐక్యతగా ఉండడం ఎంతో అవసరం అని భావిస్తున్నాను.
ఈ తరుణంలో జిల్లా ఎడిటర్స్ అసోసియేషన్ ఆదర్శవంతంగా పనిచేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.
చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను పరిష్కరించుకోవడానికి ఈ వేదిక ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నాను.
మరిన్ని కొత్త కొత్త అంశాలను మన అందరం పంచుకొని అసోసియేషన్ అభివృద్ధికి పరస్పర సహకారంతో ముందడుగు వేద్దామని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇట్టి కార్యక్రమం లో ఎడిటర్ ఆసిసియేషన్ వైస్ ప్రసిడెంట్ సిరిగాద ప్రసాద్, క్యాషియర్ సురేందర్, మండే మోహన్, రవి బాబు, రాజా లింగం, అక్షరం ప్రసాద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.