మహిళా అదృశ్యం…నిజామాబాద్ నగరంలోని ఓ మహిళ అదృశ్యమైన సంఘటన రెండవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.
నగరంలోని ఆర్ ఆర్ చౌరస్తా లోనీ కోనేరు లక్ష్మి మే 30న ఇంట్లో నుంచి వెళ్లినట్టు తెలిపారు.అప్పటి నుంచి ఆమె ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు తెలిసిన వారందరిని విచారించారు. మిత్రులు, బంధువుల ఇళ్లు వెతికారు.
అయినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు.ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు కేసు నమోదు చేసి లక్ష్మి ఆచూకీ కోసం కుటుంబీకులు, పోలీసులు గాలిస్తున్నారు.
ఆచూకీ తెలిసిన వారు 8712659836కి ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.