వాహనం పై నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. నగరంలోని కాలూర్ గ్రామానికి చెందిన కొర్వ గంగాధర్(42)భార్య,కుమారుడు ఉన్నట్లు తెలిపారు.
మంగళవారం రాత్రి వ్యవసాయ మందులు నిమిత్త నిజామాబాద్ వెళ్ళాడు. తిరిగి ఇంటికి వెళ్ళే క్రమంలో కాలూర్ శివారులోనీ బాలాజీ రైస్ మిల్లు ముందు కుక్క ను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.కుటుంబీకులు హుటాహుటిన నిజామాబాద్ ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
భార్య సవీత ఫిర్యాదు మేరకు పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.