Tuesday, January 20, 2026
HomeCRIMEమందార్నా మంజీరా నదిలో చిక్కుకున్న ముగ్గురు పశువుల కాపారులు సురక్షితం

మందార్నా మంజీరా నదిలో చిక్కుకున్న ముగ్గురు పశువుల కాపారులు సురక్షితం

మందార్నా మంజీరా నదిలో చిక్కుకున్న ముగ్గురు పశువుల కాపారులు సురక్షితం నిజామాబాద్ జిల్లా సాలూర మండలం మందార్నా గ్రామానికి చెందిన ముగ్గురు పశువుల కాపరులు పశువులను మేపడానికి ఉదయం మంజీరా నది వైపు వెళ్ళగా మధ్యాహ్నానికి మంజీరా లో నీటి ప్రవాహం పెరగడంతో ముగ్గురు నీటిలో చిక్కుకున్నారు.

స్థానికులు సొసైటీ చైర్మన్ రవికి సమాచారం ఇవ్వగా ఆయన పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన రూరల్ సీఐ,ఎస్ఐలు ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాల్ల సహాయంతో ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

గ్రామస్తులు పోలీసులను మరియు గజ ఈతగాలను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!