ఈనెల 25 నుండి 28 వరకు జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ క్రీడా పోటీలకు నిజాంబాద్ జిల్లా జట్లకు సన్నద్ధ శిక్షణ శిబిరాన్ని 20 తేదీ నుండి 24 వరకు జక్రంపల్లి మండల్ పడకల్ గ్రామంలో మహిళలకు పురుషులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈనెల 25 నుండి 28 వరకు జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో నిజాంబాద్ జిల్లా పురుషుల జట్టుకు మూడవ స్థానం కైవసం చేసుకోవడం జరిగిందని నిజాంబాద్ జిల్లా కబడ్డీ సంఘం బాధ్యులు అధ్యక్ష కార్యదర్శులు ఏ లింగయ్య గంగాధర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పడకల్ విడిసి మరియు సీనియర్ కబడ్డీ క్రీడాకారులు నిజాంబాద్ జిల్లాకు కోచ్ మేనేజర్ గా వ్యవహరించిన అశోక్ భూమ రెడ్డి ఆధ్వర్యంలో నిజాంబాద్ జిల్లా క్రీడాకారులకు అభినందనలు మరియు సన్మానాలు చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పడకల్ గ్రామస్తులు సర్పంచ్ లోకసప్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు మరియు తెలంగాణ రాష్ట్ర కబడి అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కె గంగాధర్ రెడ్డి ఉప సర్పంచ్ పురుషోత్తం వీడిసి సభ్యులు స్థానిక పాఠశాల హెచ్ఎం సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ సీనియర్ కబడ్డీ క్రీడాకారులు హాజరై క్రీడాకారులను సన్మానించారు.
కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ మునరబ్బా, తిరుపతి రెడ్డి, చిన్నయ్య, మల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు.
