HomeCRIMEవిద్యుత్ పనుల్లో భద్రత పాటించకుంటే చర్యలు- క్షేత్రస్థాయి సిబ్బందికి ఎస్‌ఈ రాజేశ్వర్‌రావు ఆదేశం-

విద్యుత్ పనుల్లో భద్రత పాటించకుంటే చర్యలు- క్షేత్రస్థాయి సిబ్బందికి ఎస్‌ఈ రాజేశ్వర్‌రావు ఆదేశం-

అందుబాటులోకి ఎల్సీ యాప్‌ క్షేత్రస్థాయిలో విద్యుత్ పనులు నిర్వహించే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా భద్రతా పరికరాలు ధరించాలని నిజామాబాద్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజేశ్వర్ రావు ఆదేశించారు.

బుధవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హెల్మెట్, హ్యాండ్ గ్లౌజ్, ఎర్త్ రాడ్ వంటి పరికరాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు చేయరాదని స్పష్టం చేశారు.పలుమార్లు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, కొన్ని చోట్ల అశ్రద్ధ వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఎస్‌ఈ పేర్కొన్నారు.

ఇకపై భద్రతా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగుల భద్రతకు తాము అగ్రప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగానే సిబ్బందికి నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

విద్యుత్ లైన్ క్లియరెన్స్ ప్రక్రియలో మానవ తప్పిదాలను నివారించేందుకు ప్రత్యేకంగా ‘ఎల్సీ యాప్‌’ను ప్రవేశపెట్టినట్లు రాజేశ్వర్ రావు వెల్లడించారు.

ఈ యాప్ ద్వారా లైన్ మెన్ సంబంధిత ఫీడర్‌పై ఏఈకి రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుందని, ఆ సమాచారం నేరుగా సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు చేరుతుందని వివరించారు. పని పూర్తయ్యాక తిరిగి యాప్‌లోనే రిటర్న్ ఇవ్వాలని, ఈ విధానం వల్ల ప్రమాదాలకు తావుండదని పేర్కొన్నారు.

జీరో ప్రమాదాలే లక్ష్యం:

సర్కిల్‌లో ‘జీరో విద్యుత్ ప్రమాదాల’ లక్ష్యంగా డీఈ (టెక్నికల్) అధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించినట్లు ఎస్‌ఈ తెలిపారు.

ప్రతిరోజు ఉదయం సెక్షన్ కార్యాలయాల్లో ‘పెప్ టాక్’ ద్వారా సిబ్బందికి భద్రతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఉద్యోగి ప్రాణం విలువైందని, కుటుంబ సభ్యుల కోసం భద్రతను విస్మరించవద్దని ఆయన సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments