ఆబ్కారీ శాఖలో విధి నిర్వహణే అత్యంత క్లిష్టమైన పని అందుకే ఆ శాఖ లో మహిళా అధికారుల ప్రాతినిధ్యమే తక్కువ ఉన్నా సరే ప్రాధాన్యత ఉన్న పోస్టింగ్ దక్కవు అక్కడ ఏ పోస్టింగ్ లో ఎవరుండాలనేది లిక్కర్ కింగ్ లే డిసైడ్ చేస్తారు.
వారి ప్రాపకం తో పోస్టింగ్ లు పొందే అధికారులు వారి ముందు సాగిలా పడి చెయ్యాలి ఇలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి నిక్కచ్చిగా పనిచెయ్యడం అందులోనూ మహిళా అధికారులకు కత్తిమీద సామే ! ఇలాంటి పరిస్థితులుండే ఆబ్కారీ శాఖ కల్తీ కల్లు మద్యం మాఫియా కోరలు చాచి ఉండే నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళా సీఐ నిక్కచ్చిగా నిబద్దత తో పనిచేస్తూ అక్రమార్కులకు సింహా స్వప్నంగా మారుతున్నారు మొన్నటి దాక టాస్క్ ఫోర్స్ లో పనిచేసి
ఈ మద్యే నిజామాబాద్ టౌన్ సీఐ వచ్చిన స్వప్న కు విధి నిర్వహణలో ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పుడు మరింత తెగింపుగా వెళ్తున్నారు గతంలో జానకంపేట్ లో కల్లు డిపో సీజ్ చేస్తే నగరం లో గంజాయి కేసులో నిందితుడి ని వదిలేయాలంటూ మీడియా ప్రతినిధులు నేతలు అదే పనిగా ఒత్తిడి చేశారు మేమిటో చూపిస్తామని ధమ్కీ లు ఇస్తే నేరుగా కమిషనర్ కే పిర్యాదు చేసింది
తన పై తప్పుడు ఆరోపణలతో చేస్తూ, డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్న థోర్పూరు దానయ్య గౌడ్‌పై సిపి కి ఫిర్యాదు చేసిన చేసింది.తెలంగాణ కల్లుగీత వృత్తి సంఘం అధ్యక్షడు దానయ్య గౌడ్ నిజామాబాద్ సీఐ పి.స్వప్నకు ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలి..
ఇవ్వకుంటే మీపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని పలుమార్లు ఫోన్ చేశాడు. మీరు నెలకు రూ.9.25లక్షల ముడుపులు తీసుకుంటున్నారని అందులో నాకు వాటా కావాలని అదే పనిగా ఫోన్ లో ఒత్తిడి చేసాడు చివరికి విసుగెత్తి ఫోన్లను ఎత్తడం మానివేశారు. ఫోన్లకు సీఐ స్వప్న భయపడడం లేదని భావించిన దానయ్య గౌడ్ మూడు పేజీల అవినీతి లేఖలను ఏసీబీకి రాస్తున్నట్లు రాసి.. ఆ లేఖలను సీఐ పంపించారు.
డబ్బులు ఇవ్వకుంటే ఈ లేఖలను ఏసీబీతోపాటు ఉన్నతాధికారులకు పంపిస్తానని సీఐ స్వప్న కు వాట్సప్ చేసాడు దీనితో శివాలెత్తిన సీఐ స్వప్న దానయ గౌడ్ రాసినఆ లేఖలను నిజామబాద్ డిప్యూటి కమిషనర్ సోమిరెడ్డి, ఈఎస్ మల్లారెడ్డికి లకు నివేదించింది . మరో అడుగు ముందుకు వేసిన సీఐ స్వప్న నిజమాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వద్దకు వెళ్లి చెప్పారు.
డబ్బుల కోసం దానయ్య గౌడ్ చేసిన ఫోన్లు, రాసిన అసత్య ఆరోపణల లేఖలను ఆయన కు చూపించిది.ఆమె తెగింపు తో నివ్వెర పోయిన సీపి సాయి చైతన్య నిజామాబాద్ మూడవ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాల్సిందిగా అదేశించారు. సీఐ ఫిర్యాదు మేరకు దానయ్య గౌడ్‌పై కేసు నమోదు చేశారు.
ఈ దానయ్య గౌడ్ గత కొంత కాలంగా రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, సిద్దిపేట్ ప్రాంతాల్లో ఇదే తరహాలో ఆబ్కారీ అధికారులను ధమ్కీ ఇస్తూ వసూళ్ల ఎగ బడుతున్న వ్యవహారాలు వెలుగు లోకి వచ్చాయి స్వప్న పిర్యాదు తో ఆ శాఖ అధికారులను సైతం కళ్ళు తెరిపించింది. అందుకే ఎక్సైజ్ శాఖ అధికారుల సంఘం అధ్యక్షుడు జె.హరి కిషన్‌తో మరికొంత డిప్యూటి కమిషనర్లు సంతాలు చేసి దానయ్య గౌడ్‌పై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌ను కోరారు.
