పాల వ్యాపారి శ్రీనివాస్ అయిదు లక్షలు 33 తులాల బంగారం పేరుతొ ఓ పాల వ్యాపారి ని టోకరా ఇచ్చిన ముఠా ను అయిదో టౌన్ పోలీసులు వేటాడి పట్టుకున్నారు .ఆంధ్ర ప్రాంతానికి చెందిన నలుగురు ఉపాధి కోసం నగరంలోని సీతారాం నగర్ ప్రాంతంకు వచ్చారు .
న్యాల్ కాల్ రోడ్డు లోని పాల వ్యాపారి శ్రీనివాస్ కు క్లోజ్ అయ్యారు. తమ ఇంట్లో మహిళా లకు క్యాన్సర్ వచ్చిందని చెప్తూ వారి కి చెందిన 33 తులాల బంగారం తక్కువ ధర కు అమ్ముతానంటూ నమ్మబలికి మొదట కొందరికి బంగారం ఇచ్చి ఆ తర్వాత అతని వద్ద అయిదు లక్షలు నగదు వసూలు చేసుకొని తమ వద్ద నగలు ఇచ్చేసి ఉడాయించాడు.
అనుమానం వచ్చి ఆ నగలు పరిశీలించి చేస్తే నకిలీ వని తేలింది నిలదీయడానికి వెళ్లేసరికి ఆ నలుగురు ఇళ్లు ఖాళీ పారిపోయారు.దీనితో బాధితుడు హుటాహుటిన అయిదో టౌన్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేశారు.మొదట 20 లక్షలు ఎత్తుకెళ్లారని చెప్పడంతో సీఐ శ్రీనివాస్ ఎస్సై గంగాధర్ లు నిందితులను పట్టుకోవడనికి పరుగులు తీశారు చివరికి డిచ్ పల్లి లో పట్టుకున్నారు బాధితుడు కూడా పోలీస్ లను పక్క దోవ పాటించాడు అయిదు లక్షలే ఇచ్చి 20 లక్షలు ఇచ్చినట్టుగా బుకాయించాడు
