HomeLaw and Order15 వ తేదీ నుండి ఇంటర్ మూల్యాంకనం... అధ్యాపకులను రిలీవ్ చేయకుంటే చర్యలు

15 వ తేదీ నుండి ఇంటర్ మూల్యాంకనం… అధ్యాపకులను రిలీవ్ చేయకుంటే చర్యలు

ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమవుతున్న ఇంటర్ మూల్యాంకనం సబ్జెక్ట్ ల అధ్యాపకులు అందరూ 15వ తేదీన రిపోర్ట్ చేయాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి శ్రీ తిరుమలపూడి రవికుమార్ తెలియజేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లు వారి కళాశాల లాగిన్ లలో అధ్యాపకుల అపాయింట్మెంట్ ఆర్డర్ లు ఇంటర్ బోర్డు నిక్షిప్తం చేసిందని ఆయన తెలియజేశారు.

మూల్యాంకన విధులు ఉన్న తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సివిక్ సబ్జెక్టు అధ్యాపకులను రిలీవ్ చేయాలని, ఎవరైనా రిలీవ్ చేయని ప్రిన్సిపాల్ లు, ప్రైవేటు యాజమాన్యం పై ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలియజేశారు.

ఆయా సబ్జెక్ట్ ల అధ్యాపకులందరూ 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూల్యాంకనం లో పాల్గొనాలని ఆయన ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments