కల్లుగీతా పారిశ్రామిక సహకార సంఘం నెంబర్ 2 వారు ఆదివారం రోజున సంఘం అధ్యక్షులు జి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా సంతాప తీర్మానం, సంఘం యొక్కజమా ఖర్చుల లెక్కలు, ప్రభుత్వాన్ని పది ఎకరాల స్థలం ఇవ్వడం గూర్చి, సొసైటీ అభివృద్ధి , వృత్తిని కాపాడుకోవడం కోసం సమావేశం జరిగింది.
ఈ యొక్క సమావేశంలో చనిపోయిన సభ్యులకు సంతాపాన్ని ప్రకటిస్తూ ఒక లక్ష రూపాయల భరోసాగా సంఘం నుండి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం ఈత చెట్ల పెంపకం కోసం పది ఎకరాల స్థలం కేటాయించాలని మరియు సొసైటీ యొక్క భవిష్యత్తును కాపాడుకోవాలని సభ్యులందరూ ఒక మూటిగా ఉండాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షులు జి సత్యనారాయణ గౌడ్ ఉపాధ్యక్షులు యెన్ బాలా గౌడ్ కార్యదర్శి కే దుర్గా గౌడ్, కే శ్రీహరి గౌడ్, కార్యవర్గ సభ్యులు, సభ్యులు పాల్గొనడం జరిగింది
