HomeTelanganaNizamabadకవితా.. కొత్త పార్టీకి ‘లిక్కర్ పార్టీ’ అని పేరు పెట్టుకో! బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్...

కవితా.. కొత్త పార్టీకి ‘లిక్కర్ పార్టీ’ అని పేరు పెట్టుకో! బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి ధ్వజం..

మాజీ ఎమ్మెల్సీ కవిత ఏప్రిల్ 25న పెట్టబోయే పార్టీకి ‘లిక్కర్ పార్టీ’ అని పేరు పెట్టుకో, అది నీకు సరిగ్గా సెట్ అవుతుందనీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీ తండ్రి సగం తెలంగాణను నాశనం చేస్తే, మిగిలిన తెలంగాణను నాశనం చేయడానికి నువ్వు బయలుదేరావనీ విమర్శించారు.

శనివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కవిత తీరుపై నిప్పులు చెరిగారు. “నిన్నటి ప్రెస్ మీట్‌లో కవిత మతిభ్రమించి మాట్లాడారనీ అసలు ఆమెకు కళ్లు కనిపిస్తున్నాయా లేక తలకెక్కి మాట్లాడుతున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.

జిల్లాలో ఏకంగా 10 ఆర్వోబి లు, ఆర్ య బి లు మంజూరు చేయించారని, అందులో మూడు ఇప్పటికే పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఇందల్వాయి, నవీపేట్ ఆర్ఓబీల కోసం కూడా ఎంపీ గారు కేంద్ర రైల్వే మంత్రిని కలిసి విన్నవించారు. కవితకు ఇవేవీ కనిపించడం లేదా అని నిలదీశారు. పసుపు బోర్డును తెచ్చిన ఘనత అరవింద్ గదేనని, పసుపు రైతుల సంక్షేమానికి ఆయన కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. నిజామాబాద్ వచ్చినప్పుడు మాత్రమే కవితకు తాను ఇందూరు ఆడబిడ్డను, కోడలిని అన్న విషయం గుర్తొస్తుందా అని ఎద్దేవా చేశారు.

ఎంపీగా ఉన్నప్పుడు మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను ఎందుకు తెరిపించలేకపోయారని ప్రశ్నించారు. అభివృద్ధిని గాలికి వదిలేసి, లిక్కర్ స్కామ్‌లో వేల కోట్లు వెనకేసుకున్నది వాస్తవం కాదా అని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో కవిత కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఇంకోసారి ఎంపీ అరవింద్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ‘ఖబడ్దార్’ అంటూ హెచ్చరించారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్లు ఇప్పకాయల సుమిత్ర దేవి, చింత ప్రసున్నారెడ్డి, కల్పే అర్చన, దాత్రికా రేవతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments