Wednesday, April 22, 2026
HomeCRIMEనిజామాబాద్ ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలంకు ఏసిపి గా పదోన్నతి..

నిజామాబాద్ ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలంకు ఏసిపి గా పదోన్నతి..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీశైలంకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా పదోన్నతి లభించింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీ/ఏసీపీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, ఆయనకు ఈ అవకాశం దక్కింది.

శ్రీశైలం తన సర్వీసులో భాగంగా జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసి సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌గా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నిఘా విభాగంలో కీలక పాత్ర పోషించారు.

ఆయన పనితీరును గుర్తించిన ప్రభుత్వం, సీనియారిటీ ప్రాతిపదికన ఏసీపీగా పదోన్నతి కల్పించింది. శ్రీశైలంకు పదోన్నతి లభించడం పట్ల జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!