Wednesday, April 22, 2026
HomeTelanganaNizamabadఅభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలి* ఆర్ అండ్ బి అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్...

అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలి* ఆర్ అండ్ బి అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సమీక్ష…

రోడ్లు భవనాల శాఖ పరిధిలో కొనసాగుతున్న పనుల్లో నాణ్యతతో చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీయూ ఎఫ్ఐడీఎస్ కింద గతంలో రూ. 60 కోట్ల నిధులతో చేపట్టిన పనులను తొందరగా పూర్తి చేయాలన్నారు. అలాగే ఎల్లమ్మ గుట్టలోని సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో గల బ్రిడ్జి పనుల పురోగతిని తెలుసుకున్నారు.

నగరంలోని ఆర్య నగర్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి దత్తాత్రేయ మందిరం వరకు రూ.22 కోట్ల నిధులతో చేపట్టిన రోడ్డు పనులపై సమీక్షించారు అలాగే నూతనంగా నగరంలో చేపట్టే బీటీ రోడ్ల ప్రతిపాదనలను తయారు చేయాలని సూచించారు.

సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ప్రజా అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ పారదర్శకంగా పనులు చేపట్టాలని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ఈ ఈ అజ్మీరా రాము, డిఈ ప్రవీణ్, ఏఈ సాయికుమార్ గుప్తా పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!