పరాకాష్టకు చేరిన టిపిబిఓల ఆగదాలు…..
అన్ని పర్మిషన్లు ఉన్నా…. అమ్యామ్యాలు ముట్టాల్సిందే…..
ఎల్ ఆర్ ఎస్ పూర్తయిన పాట్లలో నూ లేనిపోని కోర్రిలు….
నిజామాబాద్ టౌన్ ప్లానింగ్ లో అవినీతి అధికారులు రాజ్యమేలుతున్నారు. చిన్న స్థాయి అధికారులనుంచి పెద్ద స్థాయి వరకు చేయి తడవనిదే పని చేయటం లేదు. అని పత్రాలు ఉన్నా…. సదరు టిపిబిఓ లు నరకం చూపిస్తున్నారు. వారికి లంచం ఇవ్వాల్సిందే అంటూ బహిరంగంగానే అడుగుతున్నారు. బరితెగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
గంగాస్తాన్ ఆర్టీసీ కాలనీలో ని ఓ బిల్డర్ కి గత 40 రోజుల నుంచి ముప్పు తిప్పలు పెడుతున్నారు. బిల్డింగ్ నిర్మాణం కోసం సదరు బిల్డర్ అన్ని లే అవుట్ అనుమతులు తీసుకున్నా…. బిల్డింగ్ నిర్మాణం అనుమతులకు కోర్రిలు పెడుతూ…. బిల్డర్ ను డబ్బులు కావాలంటూ వేధింపులకు గురించేస్తున్నారు.
లే అవుట్ మ్యాప్, రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్స్, ఎల్ ఆర్ ఎస్ అప్రూవల్ పత్రాలు, ఫీజులు చెల్లించినా…. టిపిబిఓ లు అనుమతులు ఇవ్వటం లేదని సదరు బిల్డర్ వాపోతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు సదర్ బిల్డర్ వినతి పత్రం ఇచ్చినా కానీ టౌన్ ప్లానింగ్ యంత్రాంగం బే ఖాతరు చేస్తోంది.
మున్సిపల్ కమిషనర్ దృష్టికి రాకుండా జాగ్రత పడుతూ తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు వ్యవహారిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ అశోక్ ఎలాంటి మచ్చ రాకుండా సిన్సియర్ గా పనిచేస్తున్నారు. కానీ కింది స్థాయి సిబ్బంది చేస్తున్న నిర్వాకాలకు మామిషనర్ నివ్వేరబోతున్నారు.
నగరంలో జీ +1 పర్మిషన్. అని టౌన్ ప్లానింగ్ అధికారులు పర్మిషన్ ఇస్తారు. కానీ అక్కడ జీ +3 నిర్మాణం జరుగుతుంది. నగరం మంగళవారం పర్యటించిన కమిషనర్ కు టౌన్ ప్లానింగ్ సిబ్బంది చేస్తున్న ఆగడాలు తెలిసి షాక్ అవుతున్నారు.
ఏసీబి సోదాలు జరుగుతున్నా… బెదరని టౌన్ ప్లానింగ్ సిబ్బంది……
ఇప్పటికే అన్ని శాఖల్లో ఏసీబి రైడ్స్ అవుతున్నా…. టౌన్ ప్లానింగ్ లో ఏ మాత్రం భయం లేకుండా పోయిందంటున్నారు. టిపిబిఓలు…. సిండికేట్ గా మారి బిల్డర్ల వద్ద ఇష్టరీతిన డబ్బులకు తెగబడుతున్నారు.
గత 40 రోజులుగా బాధితులు తిరగని కార్యాలయం లేదు. అసలే రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక ఇబ్బంది పడుతుంటే మున్సిపల్ అధికారుల ఆగడాలు బిల్డర్లకు తలకు మించిన భారంగా మారుతున్నాయి.
ఇప్పటికైనా సదరు టిపిబిఓ ల పై ఎంక్వయిరి జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టిపిబిఓ ల ఆరాచకాలపై ఇది సంగతి ప్రత్యేక కథనాలు ఉంటాయి….
