నిజామాబాద్ ఇంచార్జ్ గా కలెక్టర్ గా నిర్మల్ కలెక్టర్ భావేష్ మిశ్రా నియామకం అయ్యారు. భార్య కలెక్టర్ గా పనిచేసిన జిల్లాకు ఇంచార్జ్ కలెక్టర్ గా భర్త నియామకం కావడం పాలన వ్యవహారాల్లో అరుదైనది.
జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ఇలా త్రిపాఠి ప్రసూతి సెలవులో ఉండడంతో ప్రభుత్వం ఆమె భర్త అయిన నిర్మల్ కలెక్టర్ కు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది..
ఈ మేరకు ప్రభుత్వం ఆమెకు 55 రోజుల పాటు (ఆగస్టు 6, 2026 నుంచి సెప్టెంబరు 30, 2026 వరకు) ప్రసూతి సెలవు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది.కలెక్టర్ ఇలా త్రిపాఠి గత వారం రోజుల క్రితమే ఆడపిల్ల కు జన్మనిచ్చారు.
పాలన వ్యవహారాల్లో ఆనతి కాలం లోనే తనదైన ముద్ర వేసుకున్నారు ఆమె స్థానంలో ఎవరికి బాధ్యతలు ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వం ఎడతెగని కసరత్తులు చేసింది. నిజానికి ఆమె డెలవరికి అయిన రోజే ఇంచార్జ్ బాధ్యతలు మరొకరి ఇవ్వాలి.
కామారెడ్డి నిర్మల్ జిల్లాలో కలెక్టర్ లకు ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వాలని కసరత్తులు చేశారు.కానీ కామారెడ్డి కలెక్టర్ కన్న పొరుగు పక్కనే ఉన్న నిర్మల్ జిల్లా కలెక్టర్, వైపే అధికార పార్టీ కీలక నేత మొగ్గు చూపారు.అందుకే నిర్మల్ కలెక్టర్ భావేష్ మిశ్రాకు పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు విడుదల చేశారు.
