బోధన్ పట్టణంలోని ప్రముఖ దర్గా హజ్రత్ షా జలాల్ బుఖారీ (రహ్.) వారి 675వ ఉర్సు మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, పాల్గొన్నారు.ఈ సందర్భంగా దర్గా వద్ద కమిషనర్ సంప్రదాయబద్ధంగా చాదర్ సమర్పించి , గులాబీ పువ్వులు అర్పించి నివాళులర్పించారు.
అనంతరం పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని , సమాజంలో శాంతి , సామరస్యం , సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.దర్గా నిర్వాహకులు పోలీస్ కమిషనర్ ను ఘనంగా స్వాగతించి , ఉర్సు మహోత్సవాల్లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఎ. సి. పి శ్రీనివాస్ , బోధన్ ఎస్. హెచ్. ఓ వెంకట్ నారాయణ , మునిసిపల్ వైస్ చైర్మన్ మీరు ఇలియాస్ అలీ , దర్గా కార్యదర్శి ముక్తాదారు మత పెద్దలు , కమిటీ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.
