Friday, April 24, 2026

నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు గాయపడ్డాడు.

గాంధీ చౌక్ నుంచి నెహ్రూ నగర్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొట్టడంతో వాహనదారుడు అదుపు కోల్పోయి రోడ్డుపై పడిపోవడంతో గాయాలయ్యాయి.

గాయపడిన వ్యక్తి అబ్దుల్ రహమాన్ (17), తండ్రి ఫయిమ్, పూలాంగ్ నివాసి అని గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి అతడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, ప్రమాదానికి సంబంధించిన రెండు వాహనాలను 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!