Monday, April 20, 2026
HomeTelanganaNizamabadఅభివృద్ధిలో రాజీ లేదు..రెండేళ్లలో నియోజకవర్గానికి రూ. 130 కోట్ల భారీ నిధులు!..నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్...

అభివృద్ధిలో రాజీ లేదు..రెండేళ్లలో నియోజకవర్గానికి రూ. 130 కోట్ల భారీ నిధులు!..నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిలో రాజి పడే ప్రసక్తే లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఏకంగా రూ. 130 కోట్ల భారీ నిధులను తీసుకువచ్చానని పేర్కొన్నారు.

సోమవారం జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అర్బన్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి గత రెండు సంవత్సరాల కాలంలో సుమారు రూ. 130 కోట్ల నిధులు తీసుకురావడంలో తాను విజయం సాధించానని తెలిపారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు మంజూరయ్యాయనీ పేర్కొన్నారు.

ప్రభుత్వం నుంచి నియోజకవర్గానికి వచ్చిన ప్రతి పైసాను ప్రజల సంక్షేమం, అభివృద్ధి పనులకే చేశామని తెలిపారు. ఈ నిధులతో అర్బన్ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన, రోడ్ల నిర్మాణం, తాగునీరు, విద్య, వైద్య రంగాలలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.టీయూఎఫ్ఐడిసి ద్వారా ప్రతి డివిజన్ అభివృద్ధి కోసం కోటి రూపాయల నిధులు తీసుకురావడం జరిగిందనీ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక నిధులు తాను డిమాండ్ చేసిన 100 కోట్ల ఎస్టిమేషన్‌లో ప్రభుత్వం గత నెలలో రూ. 37 కోట్లు విడుదల చేసింది.

నుడా ద్వారా అభివృద్ధి పనుల కోసం రూ. 23 కోట్లు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రూ. 2.76 కోట్లు, డబుల్ బెడ్ రూముల నిర్మాణం కొరకు 376 డబుల్ బెడ్ రూములు కంప్లీట్ అయి లబ్ధిదారులకు ఇవ్వకుండా శిథిలావస్థకు చేరుకుంటున్న వాటి నిర్మాణం అభివృద్ధి కోసం రూ. 1.25 కోట్లు, పెండింగ్ పనులు స్పెషల్ ఫండ్ ప్రగతి నగర్ స్మశాన వాటిక రూ. 3.8 కోట్లు, ఎల్లమ్మ గుట్ట బ్రిడ్జి ఎనిమిది ఏళ్ళుగా నిలిచిన పని సోనీ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్న ఈ బ్రిడ్జి నిర్మాణం రూ. 4.6 కోట్లు మొత్తం సుమారు 130 కోట్ల నిధులు రావడం జరిగిందని తెలిపారు.భవిష్యత్తులో కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం మరింతగా నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు.

ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పైసా కూడా అవినీతి లేకుండా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు పెడతానన్నారు. నియోజకవర్గంలో ఆగిపోయిన పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగల్లో లక్ష్మి నారాయణ, మాస్టర్ శంకర్ , బీజేపీ జిల్లా సెక్రటరీ జ్యోతి,ఎర్రం సుదీర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!