అధికారపార్టీలో నామినేటెడ్ పదవుల ఫై నేతల్లో ఆశలు సన్నగిల్లాయి. ఇక ఇప్పట్లో ఆ పదవులు వచ్చేలా లేవనే అసహనం నేతల్లో వ్యక్తం అవుతుంది. మూడో దఫా కార్పొరేషన్ ఛైర్మెన్ పదవులు భర్తీ చేయడానికి ఏఐసీసీ స్థాయిలో కసరత్తులు జరిగాయి.
ఈ దఫాలో కనీసం ఒక్కరికైనా పదవి దక్కే అవకాశం ఉండే . నలుగురు నేతలు నామినేటెడ్ పదవుల మీద గంపెడు ఆశలు పెట్టుకొని ఉండే కానీ ఇప్పటికే జిల్లాకు అయిదు కార్పొరేషన్ ఛైర్మెన్ పదవులు ఇచ్చారు.
వీరంతా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి బెంగపడిన వారే కావడం గమనార్హం. కానీ పార్టీలో సీనియర్లు కొత్త గా చేరిన నేతలెవ్వరికి ఇంకా పదవులే దక్కలేదు. జిల్లా స్థాయిలో జడ్పి ఛైర్మెన్, మేయర్ పదవులు మినహా ఇంకా తాము సర్దు బాటు అయ్యే పదవులు లేవు.
అందుకే పార్టీ పదవులమీద ఆశలు పెట్టుకున్నారు. కనీసం పార్టీ పదవులైన దక్కించుకోవాలనే ఆలోచన మొదలయింది. కీలక పదవులు కోసం మంత్రాంగం మొదలు పెట్టారు.
అసెంబ్లీ లోకసభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాక పోవడంతో ఎడాపెడా జిల్లాకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టే పరిస్థితి లేదు అందుకే పార్టీ పదవులతోనే సర్దుకునే ఆలోచనకు కొందరు సీనియర్ నేతలు వచ్చారు.
ఎలాగో పీసీసీ లో ఇంకా చాల పదవులు భర్తీ కావాల్సి ఉంది దీనితో పాటు కొత్త డీసీసీ నియామక కసరత్తులు మొదలు అయ్యాయి. నగర పార్టీ అధ్యక్షపదవికి కి సైతం నేతలు ఆసక్తి పెంచుకున్నారు. ముఖ్యంగా లోకల్ బాడి ఎన్నికల నేపథ్యంలో డీసీసీ పోస్టు కు బాగా క్రేజ్ వచ్చింది.
అయితే పార్టీ పదవుల విషయంలో పీసీసీ ఎడతెగని జాప్యం కొనసాగిస్తుంది లోకల్ బాడీ ఎన్నికల లోపు డీసీసీ నగర కాంగ్రెస్ కమిటీ లకు కొత్త అధ్యక్షులను నియమిస్తారా లేదా అనేది ఉత్కంఠ గా మారింది
నామినేటెడ్ పోస్టుల కోసం ఆశలు పెట్టుకున్న శేఖర్ గౌడ్ అరికెల నర్సారెడ్డి ఆకుల లలితా నగేష్ రెడ్డి లు కనీసం తమకు పార్టీ పదవుల్లో సర్దు బాటు చెయ్యాలని కోరుతున్నారు
