ఐఏయస్ అసోసియేషన్ ఇచ్చిన పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సిట్ చర్యలకు ఉపక్రమించింది. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, తో పాటు రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్ లను పోలీసులు తెల్లవారు జామున అదుపులోకి తీసుకున్నారు ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే అవకాశంఉంది మహిళా ఐఏయస్ మంత్రి విషయంలో ఎన్టీవీ న్యూస్ ఛానల్ పై వచ్చిన కథనం ఫై ఐఏయస్ అధికారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది.
టీవీ యాజమాన్యం బహిరంగ క్షమాపణ కోరింది ఆ పై సిటీ కమిషనర్ కు పిర్యాదు చేసింది దీనితో ప్రభుత్వం కఠినమైన చర్యలకు సిద్ధం అయింది సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటుఅయింది .
దీంతో సలహాదారుల సూచన మేరకు నిన్న సాయంత్రం క్షమాపణ కోరిన ఎన్టీవీ యాజమాన్యంఅందరూ సమస్య అక్కడితో అయిపోతుందని భావించారు కానీ కుటుంబంతో విదేశాలకు వెళుతున్న ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ హైదరాబాద్ ఎయిర్ పోర్టు లో బుధవారం తెల్లవారు జామున అదుపు లోకి తీసుకుంది మరో ఇద్దరు రిపోర్టర్ లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారువాళ్ళను ఎక్కడ ఉంచారో చెప్పకుండా డైరెక్టుగా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేలా ప్లాన్ చేస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్న ఛానల్ యాజమాన్యం
