జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు కోసం నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెలవారీ అద్దె ప్రాతిపదికపై కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి వాస్తు దోషం సాకుతో రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఉపయోగించడం లేదు.
దీంతో ఏడాదిన్నర కాలంగా ఈ కార్యాలయం వృథాగానే పడి ఉంది.
