మోర్తాడు మండలం దొనకల్ గ్రామానికి చెందిన ఒళ్ళెం సురేష్ ట్రాన్స్ఫారం వద్ద కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు ఎస్సై బి విక్రం పేర్కొన్నారు. సురేష్ సొంత వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండగా అదే గ్రామానికి చెందిన తీగల పెద్ద మల్లేశ్ ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంట్ రావడం లేదని చెప్పి సురేష్ ను ట్రాన్స్ఫోర్మర్ దగ్గరకి తీసుకు వెళ్ళగా, సురేష్ ట్రాన్స్ఫార్మర్ పైన విద్యుత్ తీగలు సరి చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు సురేష్ భార్య ఒళ్ళెం రాజమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ బి.విక్రమ్ తెలిపారు.
