HomeTelanganaNizamabadప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలి.. బీబీ నగర్ ఎయిమ్స్ లో అత్యాధునిక వైద్య చికిత్సలు.....

ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలి.. బీబీ నగర్ ఎయిమ్స్ లో అత్యాధునిక వైద్య చికిత్సలు.. సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ …

ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాధితులు అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. ప్రభుత్వపరంగా అనేక ఆసుపత్రులు ఉత్తమ చికిత్సలు అందజేస్తున్నా యన్నారు. జిల్లా కేంద్రంలోని జిజిహెచ్ లో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సరైన చికిత్స అందుకుంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం బీబీనగర్ లో ఏర్పాటుచేసిన ఎయిమ్స్ లో అత్యాధునిక చికిత్సలను అందజే స్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే నిమ్స్ లోనూ చికిత్స కోసం ఎల్వోసీ అవసరమైతే తమ వద్ద కు రావాలన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కుల బిల్లులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

బాధితులు దరఖాస్తు చేసుకున్న వాటిలో వారు 60 శాతం పైగా ఇవ్వాలని కోరారు. అనంతరం మొత్తం 97 మంది లబ్ధిదారులకు రూ.21,43,000 విలువైన చెక్కులను అందజేశారు.

కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మల్లేష్ యాదవ్, మఠం పవన్, ఎర్రం సుధీర్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, బంటు ప్రీతి ప్రవీణ్, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments