HomeTelanganaNizamabadజిల్లా నేలలకు అనుకూలమైన విత్తనాలే ఇవ్వాలి..కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్

జిల్లా నేలలకు అనుకూలమైన విత్తనాలే ఇవ్వాలి..కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్

రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఎనిమిది రకాలకు బదులుగా.. జిల్లా నేలలు, వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన సన్న వరి విత్తనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని, తక్షణమే రైతులకు పంపిణీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులచారి డిమాండ్ చేశారు.

సోమవారం ఇందూరు జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఆయన, పార్టీ నాయకులతో కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వానకాలం సీజన్‌లో వ్యవసాయ శాఖ సూచించిన 8 రకాల సన్న వరి రకాలనే సాగు చేయాలంటూ నిబంధనలు పెట్టడం, విత్తన దుకాణాల్లో కూడా వాటినే విక్రయించాలని ఆంక్షలు విధించడం వల్ల ఇందూర్ జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం చెప్పిన 8 రకాల్లో కేవలం 4 మాత్రమే మన జిల్లా వాతావరణానికి సరిపోతాయని.. HMT (సోనా), WGL-962, BPT-5204 (సాంబ మసూరి), JGL-1798 వంటి రకాలను ఇక్కడి రైతులు సాధారణంగా సాగు చేయరని స్పష్టం చేశారు.మన జిల్లా వాతావరణానికి సంపూర్ణ కావేరి 108, MTU-1282, MTU-1224, KNM-7715, KNM-12472, RBR-1200, CCRA, కోణార్క్ రకాల వడ్లు మాత్రమే అత్యంత అనుకూలమైనవని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక పరిస్థితులకు సరిపడని విత్తనాలను ప్రభుత్వం బలవంతంగా రుద్దితే, రేపు ఆశించిన దిగుబడి రాక అన్నదాతలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మరోవైపు మే 25వ తేదీ నుంచి రోహిణి కార్తె ప్రారంభం కాబోతోందని, సాధారణంగా ఈ సమయానికి రైతులు నారు పోసే పనులకు సిద్ధంగా ఉంటారని దినేష్ పటేల్ గుర్తుచేశారు. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి విత్తనాల పంపిణీ జరగలేదన్నారు.

సమయానికి విత్తనాలు అందక, ప్రైవేటు దుకాణాల్లో ఆంక్షల వల్ల ఏ రకం కొనాలో తెలియక రైతాంగం తీవ్ర అయోమయంలో ఉందన్నారు. ఒకవేళ విత్తనాల కొరతతో రైతులు దొడ్డు రకం వడ్లు వేసుకుంటే.. ప్రభుత్వ బోనస్ దక్కక ఆర్థికంగా కుదేలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.జిల్లా రైతులు పండించే ఏ సన్న రకం వడ్లకైనా ప్రభుత్వం ఇచ్చే బోనస్ వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కలెక్టర్‌ను కోరారు.

రోహిణి కార్తెను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన సన్న రకం నాణ్యమైన వరి విత్తనాలను వెంటనే సరఫరా చేయాలని, రైతుల శ్రేయస్సు కోసం తక్షణమే సానుకూల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments