నీళ్లు కావాలంటూ ఓయూలో శనివారం అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన కు దిగారు.
తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు కూడా లేవని వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డు మీద బైఠాయించి న విద్యార్థులు సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించలేదని వాపోయారు. ఉదయం నుంచి నీళ్లు లేవని మొర పెట్టుకుంటే రాత్రి ఒక్క ట్యాంకర్ పంపారని.. అవి దేనికీ సరిపోలేవన్నారు వెంటనే నీటి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.