గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల కోసం పనిచేయడమేఇండియన్ పీపుల్స్ ఫోరం లక్ష్యంగా పెట్టుకుందని ఆ సంస్థ ప్రతినిధి జితేంద్ర వైద్య అన్నారు ఆయన ఆదివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు .
పొట్ట కోటి కోసం కుటుంబాలను వదిలేసి గల్ఫ్ దేశాలకు వెళ్లి పని చేసిన వారు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని వారిని వారి ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపడానికి తాము అండగా నిలబడ్డామని ఆయన అన్నారు తమ పోరం పక్షాన 12 మంది డాక్టర్లు 10 మంది న్యాయవాదులు పనిచేస్తున్నారని భారతీయులకు ఆరోగ్యపరంగా ఏ సమస్య తలెత్తిన డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండి వారికి సేవ చేస్తున్నారని అలాగే తమ పని చేస్తున్న కంపెనీలలో ఏదైనా న్యాయపరమైన చట్టపరమైన సమస్యలు వచ్చినప్పుడు తమ న్యాయవాదులు వారి పక్షాన పోరాడుతున్నారని ఆయన గుర్తు చేశారు కరోనా కష్టకాలంలోనూ తమ ఫోరం సభ్యులు గలుపు దేశాల్లో ఆయా సెంటర్లలో ఉన్న ప్రవాస భారతీయుల కోసం ఎంతో సేవ చేశారని వారికి ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు వైద్య పరంగా మందులు ఇతర సదుపాయాలు కల్పించాలని అలాగే వారికి భోజన వసతి కూడా అందించామన్నారు.
తో పాటు తమపురం స్వతగా 12 విమానాలు ఏర్పాటుచేసి గల్ఫ్ దేశాలు ఉన్న ప్రవాశీలను సదేశాలకు వచ్చే విధంగా ఏర్పాటు చేసిందన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల కోసం ఎంతో శ్రమించారని జనవరి 1 రోజు ఆయా దేశాల్లో ఉన్న ప్రభాస భారతీయులను కలవడానికి అరవింద్ ఆసక్తిగా ఉంటారని ఆయన గుర్తు చేశారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులకు ఏ కష్టం వచ్చినా తమ ఫోరం 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు.
