45 ఏళ్ల రాజకీయ జీవితంలో జీవన్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి ఏమి చేసాడో చెప్పాలని బిజెపి లోక్సభ అభ్యర్థి అరవింద్ డిమాండ్ చేశారు గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని అలాగే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని జీవన్ రెడ్డి పదేపదే చెప్తున్నారని కానీ వీటిని రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సి వుంటుంది .
కేంద్ర ప్రభుత్వం ప్రమేయమే వుండదు కానీ లోక సభ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఈ రెండు అంశాలు చెప్తూ ఓట్లు ఎందుకు అడుగుతున్నాడని ఆయన మండిపడ్డారు. గల్ఫ్ లో ఉన్న అమాయక ప్రజలను మభ్యపెట్టి డానికే గల్ఫ్ బోర్డు ను ఎన్నికల ముందు తెరమీదికి తెచ్చారన్నారు పొట్ట కోటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారిని దిక్కుమాలినరాజకీయాల కోసం వాడుకోవడం జీవన్ రెడ్డికి తగదన్నారు..
45 ఏళ్లుగా గల్ఫ్ బోర్డు పెట్టాలని సోయి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదని ఆయన మండిపడ్డారు.