ఈ సందర్భంగా పంచ రెడ్డి చరణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలను వీసి గారి దృష్టికి తెచ్చారు నూతనంగా బాలికల వసతిగృహం నిర్మించాలని అలాగే విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని స్పోర్ట్స్ బోర్డ్ ను ఏర్పాటు చేయాలని అలాగే నూతన కోర్సులను ప్రవేశ పెట్టడంతో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను కూడా ప్రారంభించాలని,
అలాగే విశ్వవిద్యాలయంలో వివిధ శాఖలలో బోధన మరియు బోధనేతర సిబ్బంది కొరత తీవ్రంగా వుందని దానిపై దృష్టి సారించాలని, పరిశోధన విద్యార్థులకు ప్రత్యేక వసతి గృహం నిర్మించాలని,
న్యాక్ గుర్తింపు కోసం విశ్వవిద్యాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని దానికి తెలంగాణ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం తరపున కావలసిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన విసి గారితో పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయ రిజిస్టర్ యాదగిరి తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామావత్ లాల్ సింగ్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
