స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా సర్పంచి, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సమగ్ర మార్గదర్శకాలతో ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగించారు.
జిల్లాలోని 545 సర్పంచి స్థానాలకు, 5022 వార్డు స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50శాతం రిజర్వేషన్లకు మించకుండా ప్రక్రియ పూర్తి చేశారు.
మొత్తం స్థానాల్లో మహిళలకు 50 శాతం స్థానాలను లక్కీ డ్రా ద్వారా నిర్ణయిస్తారు. సర్పంచి స్థానాలకు ఆర్డీవోలు, వార్డు స్థానాలకు ఎంపీడీవోలకు బాధ్యతలు అప్పగించగా వారు ప్రక్రియ పూర్తి చేసి జిల్లా పాలనాధికారికి నివేదించారు.
