కష్ట కాలం లో వెన్నంటి ఉన్న వారిని అధికారం వచ్చిన నప్పుడు అందలం ఎక్కించడం రాజకీయ నేతల కు ఉండాల్సిన లక్షణం ! జిల్లా రాజకీయాల్లో ఇలాంటి నేతలు చాల అరుదు అదే కోవలోకి వస్తారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ .
జిల్లా పార్టీలో తన మాట చెల్లు బాటు కానీ రోజుల్లో తనకు అండగా ఉన్న నేతలను మహేష్ ఇప్పుడు అక్కున చేర్చుకుంటున్నారు.మూడున్నర దశాబ్దులుగా తనతో పాటు అడుగులేస్తున్న వారు అనామకులైన సరే అందలం ఎక్కిస్తున్నారు.
వారితో భవిష్యత్తు లో రాజకీయంగా విసెత్తు ప్రయోజనం లేకపోయిన సరే మహేష్ లెక్క చేయడం లేదు ప్రభుత్వ పరంగా దక్కే నామినేటెడ్ పదవుల సంగతి ఎలా ఉన్న పార్టీ పదవుల పంపకాల్లో తానే సుప్రీం కదా అందుకే నో రూల్స్ జస్ట్ తన విధేయత నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఎడా పెడ పదవులు పప్పు బెల్లం ల పంచేస్తున్నారు.
యన్ యస్ యూ ఐ నుంచి రాజకీయ ప్రస్ఠానం మొదలు పెట్టిన మహేష్ సుదీర్ఘ కాలం ఆ విభాగంలోనే కొనసాగారు. అదే కోట లో ఎమ్మెల్యే టికెట్ సాధించారు అప్పటి నుంచి జిల్లా పార్టీలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు దిగ్గజ నేతల మధ్య ఆయన పార్టీ లో అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కున్నారు. పార్టీ లో తన ప్రాబల్యం తగ్గి పోయిన నేపథ్యంలో వెన్నంటి నిలిచినా నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం మరో నీడ లోకి వెళ్లారు.
కానీ ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆవసరం లేదనుకున్న వారంతా మహేష్ తోనే జర్నీ సాగించారు.వారికి ప్రజాక్షేత్రంలో ప్రాబల్యం లేక పోవచ్చు కానీ విధేయత కావలిసినంత ఉంది. అందుకే రాజకీయ ప్రయోజనాలు సామజిక సమీకరణాలు సైతం పక్కకు పెట్టి మరీ తన విధేయులకు పదవులు కట్టబెడుతున్నారు. విపుల్ గౌడ్ తో మొదలై బొబ్బిలి రామకృష్ణ దాక అర డజన్ మందికి అనూహ్యంగా పదవులు దక్కాయి.
గతం లో డీఎస్ పీసీసీ చీఫ్ గా పనిచేసినప్పుడు కూడా పదవులు దక్కినా ఇప్పుడు మహేష్ అంత కన్న ఎక్కువే చేస్తున్నారనే టాక్ పార్టీవర్గాల్లో వచ్చింది.పీసీసీ కార్యవర్గంలో పోస్టు కోసం జిల్లా నుంచి కీలక నేతలు క్యూ కట్టారు.కనీసం మూడునాలుగు పోస్టు లు వస్తాయని ప్రచారం జరిగింది.కానీ జిల్లా నుంచి ఒక్కరే ప్రధాన కార్యదర్శి గా రాంభూపాల్ నియామకం అయ్యారు.
అయన ప్రజల్లో ఉన్న నేత కాదు కనీసం కౌన్సిలర్ టికెట్ కూడా దక్కలేదు. కానీ జస్ట్ విధేయుడి కోట లోనే ఏకంగా పీసీసీ జనరల్ సెక్రెటరీ అయ్యారు. అలాగే పీసీసీ అనుబంధ విభాగం లో మజీద్ కు అయన వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ గా డిఎస్ కోట దక్కినా ఆ తర్వాత మహేష్ వెంట గట్టిగా నిలబడ్డారు.అలాగే మరో విధేయుడు న్యాయ వాదీ రామకృష్ణ ఆయనకు ఏకంగా పీసీసీ క్రమశిక్షణ సంఘం సభ్యుడుగా నియామకం అయ్యారు.
మరో విధేయుడు శేఖర్ గౌడ్ ను డీసీసీ పీఠం అప్పగించాలని భావించారు.కానీ కార్పొరేషన్ ఛైర్మెన్ గా నియామకం అయ్యే అవకాశం వుండడం తో వెనక్కి తగ్గారు. డీసీసీ స్థాయి ఉన్న అర్బన్ పగ్గాలు మాత్రం దిగ్గజ నేతలు ఒత్తిడి చేసిన విధేయత కు పట్టం కట్టాడు.బొబ్బిలి రామకృష్ణ ను అర్బన్ అధ్యక్ష పదవి ఇచ్చారు.
