ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేహ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోనళలు చేపట్టారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా లోక్ భవన్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టుతో పాటు నీట్ పరీక్ష వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు మహేష్ కుమార్ గౌడ్‌ను అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు..
