HomeTelanganaNizamabadమున్సిపల్ ఎన్నికల ఫై పీసీసీ రివ్యూ

మున్సిపల్ ఎన్నికల ఫై పీసీసీ రివ్యూ

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ , టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకోవాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు , సుదర్శన్ రెడ్డి షబ్బీర్ అలీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ , డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి ,వినయ్ రెడ్డి , సునీల్ చిన్న రామకృష్ణ , కార్పొరేషన్ చైర్మన్ లు అనిల్ కుమార్ , మానాలా మోహన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి ,కేశ వేణు సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని చూరగోనేలా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments