HomeTelanganaNizamabad'మన ఇందూరు - మన మేయర్' నినాదంతో మున్సిపల్ ఎన్నికలకు వెళ్దాంబిజెపిలోకి భారీగా చేరికలు..కండువా కప్పి...

‘మన ఇందూరు – మన మేయర్’ నినాదంతో మున్సిపల్ ఎన్నికలకు వెళ్దాంబిజెపిలోకి భారీగా చేరికలు..కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ధన్ పాల్”

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ‘మన ఇందూరు – మన మేయర్’ నినాదంతో బిజెపి జెండాను ఎగురవేద్దాం” అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు.

గురువారం జిల్లా బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో 22వ డివిజన్ కు చెందిన మాజీ కార్పొరేటర్ పోతుల పురుషోత్తం ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్యకర్తలు బిజెపిలో చేరారు. వీరికి ఎమ్మెల్యే ధన్ పాల్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో గత దశాబ్ద కాలంగా దేశం అవినీతి రహితంగా, ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని కొనియాడారు. బిజెపి అంటేనే అభివృద్ధి అని, అభివృద్ధి అంటేనే బిజెపి అని ఆయన స్పష్టం చేశారు.

ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లాలో చేపడుతున్న విస్తృత అభివృద్ధి పనులకు ఆకర్షితులై అనేకమంది పార్టీలోకి రావడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎమ్మెల్యే ఈ సందర్భంగా. ఏకరువు పెట్టారు.

తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్లు అందిస్తూ పేదలకు అండగా నిలవడం.రూపాయల వరకు రుణాలు అందిస్తూ స్వయం ఉపాధికి. బాటలు వేయడం.కేవలం 14 రూపాయలకే 2 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించడం మోడీ ప్రభుత్వానికే సాధ్యమైందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చేరిన 22వ డివిజన్ మహిళలు రాబోయే ఎన్నికల్లో బిజెపి వెంటే ఉంటామని ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చారు. ఈ భారీ చేరికలతో మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాటికొండ రాము, ఆకుల శ్రీనివాస్, రాజ్ కుమార్, గౌత ఆనంద్, కుందన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments