గత రెండు రోజులుగా మేడారంలోనే ఉండి బందోబస్తు ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జాతరకు పోటెత్తుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ల నిర్వహణను పరిశీలించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ విభాగానికి కీలక సూచనలు చేశారు.విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా ఉంటూనే, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మహా జాతర కావడంతో కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు భద్రతతో పాటు, తప్పిపోయిన వారిని చేర్చడం మరియు అత్యవసర సేవలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. నిజామాబాద్ నుండి వెళ్ళిన పోలీస్ బలగాలను సమన్వయం చేస్తూ, జాతర విజయవంతం కావడానికి కృషి చేస్తున్నారు.
