HomeTelanganaNizamabadలోకల్ వార్ ఫై పీసీసీ వర్సెస్ సర్కార్ ..........రిజర్వేషన్ ఫై పట్టు వదలని పీసీసీ...

లోకల్ వార్ ఫై పీసీసీ వర్సెస్ సర్కార్ ……….రిజర్వేషన్ ఫై పట్టు వదలని పీసీసీ …….ఎటూ తేల్చుకోలేని సర్కార్ ……మరో జీవో జారీచేసే యోచనలో రేవంత్ ప్రభుత్వం

స్థానిక సంస్థలకు ఎన్నికలవ్యవహారం పీసీసీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా మారింది. రిజర్వేషన్ విషయంలో పీసీసీ పట్టు వదలడం లేదు. దీనితో ఎన్నికల విషయంలో రేవంత్ ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేక పోతుంది.హైకోర్టు విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది.

అందుకే బీసీ రిజర్వేషన్ ఫై మరో జీవో ను తెచ్చి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. ఎలాగో రిజర్వేషన్ ఫై 50 శాతం పరిమితి ఎత్తివేస్తూ ప్రభుత్వం తెచ్చిన ఉత్తర్వ్యూలకు గవర్నర్ ఆమోదం తెలిపింది.

ఈ నేపథ్యంలో 42 బీసీ లకు రిజర్వేషన్ కల్పించే కొత్త జీవో కు ఎలాంటి ఆటంకాలు రాకపోవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అయితే సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో శనివారం సుదీర్ఘ సమాలోచలు జరిగాయి.

కానీ మహేష్ కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా ఎట్టి పరిస్థితి ల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల కు వెళ్ళద్దని తెగేసి చెప్పారు అసలు పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ హోదా లో కామారెడ్డి డిక్లరేషన్ తానే ప్రతిపాదించానని పీసీసీ ఉండి కూడా ఇప్పడు డిక్లరేషన్ పక్కకు పడిస్తే ఎలా ఆయన పార్టీ పెద్దలను ఈపాటికే అడిగారు.

పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు వేణుగోపాల్ లు మహేష్ వాదన కు సానుకూలత వ్యక్తం చేసారు. అందుకే సీఎం రేవంత్ స్థానిక ఎన్నికల విషయంలో పీసీసీ ని కాదని ముందుకు వెళ్లలేక పోతున్నారు.

రిజర్వేషన్ లకు చట్టబద్దత కల్పించాకే ఎన్నికలు జరపాలనేది పీసీసీ ఆలోచనగా ఉంది. అందుకే మద్యే మార్గంగా ప్రభుత్వం తాజా జీవో ను తెరమీదికి తేబోతుంది.

ఈ వ్యవహారంలోనూ ఏదైనా న్యాయ పరమైన అడ్డంకులు తలెత్తితే ఎన్నికల పక్రియ ను వాయిదా వేయాలనేది ప్రభుత్వం యేచిస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments