HomeCRIMEపొతంగల్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీసు కమిషనర్

పొతంగల్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీసు కమిషనర్

బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పొతంగల్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఆకస్మికంగా తనిఖీ చేసారు

ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద గల సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అక్కడ గల రికార్డు లను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు.

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని అక్రమంగా పశువుల ను తరలించడం జరగకూడదని , ప్రతీ వాహనానికి గల కాగితాలు తనిఖీ నిర్వహించాలని తెలియజేశారు

అనంతరం వాహనాలను తనిఖీలు నిర్వహించారు. బోధన్ ఎ.సి.పి శ్రీనివాస్, రుద్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ , కోటగిరి పిఎస్ ఎస్ఐ సునీల్ లున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments