పోలీస్ శిక్షణ సెంటర్ ను పర్యవేక్షించిన చేసిన సీపీ రాబోయే పోలీస్ శిక్షణార్థులకు అనుకూలంగా ఉండే విధంగా అవసరమైన అన్ని సౌకర్యాలు , వసతులు అందుబాటులో ఉండాలని సిపి సాయి చైతన్య ఆదేశించారు.
సోమవారం ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట వద్ద గల పోలీసు శిక్షణ కేంద్రమును ఆయన పర్యవేక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..పోలీస్ శిక్షణ సెంటర్ అనేది భవిష్యత్ పోలీస్ అధికారుల పాత్రను తీర్చిదిద్దే కేంద్రం. ఇక్కడ శిక్షణ పొందేవారికి శారీరక , మానసిక అభివృద్ధి జరిగేలా వాతావరణం ఉండాలనీ తెలిపారు.
తగిన వసతులు , శిక్షణా పరికరాలు , శిక్షకులు అందుబాటులో ఉండేలా చూడాలి” అని పేర్కొన్నారు. సెంటర్‌లో వసతులు , ట్రైనింగ్ సెంటర్ గదులు , వంటశాల , నీటి సరఫరా , శౌచాలయాలు , ఇండోర్ తరగతి గదులు , అవుట్ డోర్ పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్ తదితర అంశాలను పరిశీలించిన ఆయన , తక్షణమే కొంతమేర మెరుగుదలలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా బోధన్ ఏసిపి శ్రీనివాస్ , బోధన్ రూరల్ సి.ఐ విజయ్ బాబు , ఎడపల్లి ఎస్సై ఎమ్. రమ, ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
