HomeTelanganaNizamabadబెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి..ధర్నా చౌక్ లో విద్యార్థుల నిరసన..

బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి..ధర్నా చౌక్ లో విద్యార్థుల నిరసన..

బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ మేరకు బెస్ట్ అవెల బుల్ స్కీం పేరెంట్స్ నిజామాబాద్ కమిటీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు సోమవారం నగరంలోని ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్బంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రూ.210 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని తల్లిదండ్రులు కోరారు.

బెస్ట్ అవెలెబుల్ స్కీం బాధిత విద్యార్థి తల్లిదండ్రుల గోస ప్రభుత్వానికి పట్టదా అని ఆవేదన వ్యక్తం చేశారు. బెస్ట్ అవెలబుల్ స్కీంని తొలగించే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలన్నారు.

ఈ నిధులు విడుదల కాకపోవడం వల్ల పాఠశాలలు విద్యార్థులకు ఫీజులు చెల్లించమని చెప్పి, వారిని చేరనివ్వడం లేదని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా పాఠశాలలోనికి వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments