కాంగ్రెస్ పార్టీలో పదవుల పండగ మొదలయింది.పార్టీలో కీలక పదవుల కోసం ఏఐసీసీ స్థాయిలో నే కసరత్తులు జరుగుతున్నాయి.విస్తృతమైన సంప్రదింపుల తర్వాతే పదవుల కేటాయింపు జరిగేలా కార్యాచరణ ఖరారు చేశారు.
కర్నాటక కు చెందిన ఎమ్మెల్యే ఇంచార్జ్ గా నియామకం అయ్యారు. పీసీసీ పరిశీలకులు ఈపాటికే కార్యక్షేత్రంలోకి దిగి పార్టీ పదవుల పక్రియ ను మొదలు పెట్టారు. నామినేటెడ్ పదవుల పంపిణీ పూర్తీ అయింది.
ఆ పదవులు దక్కించుకొని నేతలు పార్టీ పదవుల కోసం పోటీ పడుతున్నారు.ఆశావహులు డీసీసీ భవన్ లో రెండు రోజులగా దరఖాస్తులు చేస్తున్నారు నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి రసవత్తరంగా మారింది. అరడజన్ మంది కీలక నేతలు అర్బన్ అధ్యక్ష పదవీ కోసం పోటీ పడుతున్నారు.
అర్బన్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కి ఎవరికి కట్టబెట్టాలనే విషయంలో ఈపాటికే పీసీసీ చీఫ్ కు స్పష్టత కు వచ్చారు కానీ ఆయన తాను మెచ్చిన నేతకు పదవి దక్కేలా ఎలా చక్రం తిప్పావుతారనేది ఆసక్తిగా మారింది.
ఎందుకంటే అర్బన్ కాంగ్రెస్ విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ తో పాటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి షబ్బీర్ అలీ లు జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఈ ముగ్గురు నేతలలకు ఆమోదం యోగ్యం అయిన నేతకే అర్బన్ కాంగ్రెస్ పగ్గాలు దక్కే ఛాన్స్ ఉంది.
పీసీసీ చీఫ్ మహేష్ ప్రతిపాదనలకు షబ్బీర్ సుదర్శన్ రెడ్డి అడ్డు తగిలే పరిస్థితి లేదు అందుకే మహేష్ ఎవరికి వైపు మొగ్గు చూపనున్నారనేది పార్టీ వర్గాలకు ఉత్కంఠ గా మారింది. మరో వైపు అర్బన్ అధ్యక్ష పదవి కోసం అనేక మంది పోటీ పడుతున్నారు ఎవరికి పదవి కట్టబెట్టాలనేది కత్తిమీద సాముగా మారింది.
ఈసారి అర్బన్ కాంగ్రెస్ ను మైనార్టీ వర్గాలకు కేటాయించాలనే డిమాండ్ తెరమీదికి వచ్చింది కానీరెండు సార్లు వరుసగా అసెంబ్లీ టికెట్ కేటాయించినా ఫలితం దక్కలేదు అందుకే అర్బన్ అధ్యక్ష పదవీ ఇవ్వడానికి పార్టీ పెద్దలు వెనుకాడుతున్నారు.
బీసీ రిజర్వేషన్ ల వ్యవహారం తెరమీదికి వచ్చిన నేపథ్యంలో అర్బన్ అధ్యక్ష పదవి బీసీ వర్గాలకు ఇవ్వడానికి సిద్ధం అయింది ఇందులో బాగంగానే బీసీ వర్గానికి చెందిన వారే దరఖాస్తు చేశారు.
అర్బన్ లో మున్నారు కాపు సామజిక వర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గం నేతకే అర్బన్ పగ్గాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారుఅందుకే మున్నారు కాపు సామజిక వర్గం కు చెందిన బొబ్బిలి రామకృష్ణ, రత్నాకర్.
పంచరెడ్డి చరణ్ ,కౌడప్ శరత్ లు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు మైనార్టీ వర్గానికి చెందిన సీనియర్ నేత జావీద్ అక్రమ్. లు అర్బన్ అధ్యక్ష పదవి రేసులో ముందున్నారు.
