శివాజి విగ్రహం ఏర్పాటు ముప్కాల్ మండల కేంద్రంలో వివాదానికి దారితీసింది పోలీసులు జోక్యం చేసుకొని సర్ది చెప్పడంతో ఇరువర్గాలు వెనక్కి తగ్గాయి ఆదివారం ఉదయం పాత జాతీయ రహదారికి అనుకోని ఉన్న మార్కెట్ యార్డ్ స్థలం వద్ద శివాజీ విగ్రహం ఏర్పాటు కోసం సన్నాహాలు చేసారు.
కానీ ఓ వర్గం వారు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ మేరకు గ్రామాభివృద్ధి కమిటీ కి లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసారు దీనితో ముప్కాల్ గ్రామానికి చెందిన యువకులు ఆందోళనకు దిగారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏసీపీ బస్వారెడ్డి, సీఐ శ్రీధర్ రెడ్డిలు హుటాహుటిన రంగంలోకి దిగారు ఇరువర్గాలకు నచ్చజెప్పారు
