పేకాట ఆడుతున్న 4 గురినీ అరెస్టు చేసినట్లు నాలుగవ టౌన్ పోలీసులు పేర్కొన్నారు.
ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని పూలాంగ్ ప్రాంతంలో నలుగురు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించి పటుకున్నట్లు తెలిపారు.
వారి నుంచి రూ 15,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
