HomeEditorial Specialకులసంఘాల ఎన్నికల్లో రాజకీయ రచ్చ ......ఆధిపత్య పోరు లో ప్రధాన పార్టీలు .........నిలువునా చీలుతున్న...

కులసంఘాల ఎన్నికల్లో రాజకీయ రచ్చ ……ఆధిపత్య పోరు లో ప్రధాన పార్టీలు ………నిలువునా చీలుతున్న వైనాలు ..

రాజకీయ రచ్చకు కులసంఘాలు వేదికగా మారాయి. ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతున్న ఎన్నికల పక్రియ సైతం అపహాస్యం అవుతున్నాయి.

ఆయా సంఘాల్లో ఆధిపత్యం కోసం ప్రధాన పార్టీల నేతలు వెంపర్లాడుతున్నారు. ఫలితంగా సంఘాలు నిలువునా చీలిపోతున్నాయి. పేరుకు బ్యాలెట్ పద్దతి లో ఎన్నికలు జరుపుకుంటున్నా వివాదాలతో రోడ్డెక్కుతున్నారు.

తెరవెనుక నేతలు పావులు కదపడం వల్లే ఐక్యత కోసం ఏర్పాటైన కుల సంఘాల్లో కలహాలు రేగుతున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఎన్నికల పక్రియ దాదాపు నెలరోజులు జరిగింది. చివరికి పోలింగ్ లో అక్రమాలు జరిగాయంటూ కౌంటింగ్ ను నిలిపి వేశారు.

సుమారు వంద కోట్ల మేరకు ఆస్తులున్న ఆర్యవైశ్య సంఘం కు అయిదు అనుబంధ సంఘాలున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మలుపు తిరిగాయి.

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రధాన పార్టీల్లో కీలక నేతలుగా చెలామణి లో ఉన్నవారే అందుకే గెలవడానికి సర్వశక్తులు ఒడ్డారు.లక్షలాది రూపాయలు తృణా ప్రాయంగా వెచ్చించారు.

సాధారణ ఎన్నికల తరహాలోనే పోలింగ్ ఏర్పాట్లు జరిగాయి.ఓట్లు పక్రియ పూర్తయ్యే సమయంలో వివాదం తలెత్తింది. చివరికి ఏసీపీ స్థాయి అధికారి రంగంలోకి దిగిన సర్దుబాటు కాలేదు మరుసటి రోజే జరగాల్సిన పోలింగ్ మూడు రోజులైనా మొదలు కావడం లేదు.

పోలింగ్ పక్రియ లో అక్రమాలు జరిగాయనేది కొందరు అభ్యర్థుల ఆవేదన. వైశ్య సామాజిక వర్గం నుంచి ప్రధాన పార్టీలో కీలక నేతలున్నారు.అందుకే ఎన్నికల పక్రియ రాజకీయ రచ్చగా మారింది.

అలాగే నగరంలో మరో పెద్ద సామజిక వర్గంగా ఉన్న పద్మశాలి సంఘంలో ఎలాంటి పరిణామాలే కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్య పద్దతి లో జరిగిన ఎన్నికలు ఇప్పుడు ఆ సంఘం ను రెండు గా చీల్చింది.

కోట్ల రూపాయల ఆస్తి వుండడం తో సంఘం పగ్గాలు కోసం సహజంగానే పోటా పోటీ వచ్చింది. ప్రతియేటా జరిగి నట్లే ఈసారి సంఘం ఎన్నికలు ధూమ్ ధామ్ గా జరిగాయి.

ఈ సంఘంలోనూ ఎన్నికలు బీజేపీ వర్సెస్ బిఆర్ యస్ గా సాగాయి.రెండు ఫ్యానల్ లు హోరాహోరీగా తలపడ్డాయి. మాజీ తహశీల్ధార్ దత్తాద్రి ఫ్యానల్ గెలిచింది.ఆయా పార్టీల అగ్ర నేతల సమక్షంలో అట్టహాసంగా పదవి ప్రమాణం జరిగింది.

కానీ పది రోజుల్లో సంఘంలో తిరుబాటు మొదలయ్యింది. మొత్తం సంఘం మూడు గ్రూప్ లుగా విడిపోయింది. మరో ఇద్దరు తాము జిల్లా అధ్యక్షులుగా ప్రకటించుకున్నారు.ఈ పరిణామాలతో సంఘ సభ్యులు కంగుతిన్నారు.

నగరంలో ముదిరాజ్ పెరిక వంజరి సంఘాల్లోనూ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. కుల సంఘాల్లో గెలిచిన వారంతా ఆయా పార్టీల్లో క్రియ శీలా నేతలుగా అవతారం ఎత్తుతున్నారు.

ఆయా పార్టీల్లో తమ ప్రాబల్యం పెంచుకోవడానికి కొందరు కులపెద్దలు నేతలు ఆడుతున్న అట కు కుల సంఘాలు పావు మారుతున్నాయి.రాజకీయాల్లో ఎదగడానికి ప్రజల్లో పలుకుబడి సాదించ లేని వారు కులసంఘాల ముసుగు లోనే ఆయా పార్టీల్లో అందలం ఎక్కుతున్నారు.

చెట్టుకొకరు పుట్టకొకరు పుట్టకొకరు అన్నట్లుగా ఉన్నవారంతా ఒకే వేదిక మీద చేరి కలిసి కట్టుగా సాగడానికే కులసంఘాలు ఓ వేదికగా మారాయి. గతంలో గ్రామీణ ప్రాంతాలకే పరిమితం అయినా కులసంఘాల ఉనికి ఇప్పుడు నగరంలో అనూహ్యంగా విస్తరించింది.

ఒక్కో కులసంఘం కోట్లాది రూపాయల ఆస్తులను కలిగి ఉన్నాయి. ఎమ్మెల్యే ఎంపీ లు సైతం ప్రజల మౌలిక సదుపాయాల కన్న కులసంఘాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు కోట్ల రూపాయల సర్కార్ నిధులు దారాదత్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments