జిల్లాలోని పలువురు తహసీల్దార్లకు ఇటీవల బదిలీలు జరగగా.. వారి స్థానంలో జిల్లాకు కేటాయించిన తహసీల్దార్లకు పోస్టింగ్లు ఇస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఆయా స్థానాల్లో వెంటనే బాధ్యతలు స్వీకరించనున్నారు.
చందూర్ మండలం నుంచి వచ్చిన టీ.శాంత ను ధర్పల్లీ తహసీల్దార్ గా, నిర్మల్ జిల్లా నుంచి వచ్చిన తహసీల్దార్ శ్రీనివాస్ ను వేల్పూరు మండలంకు, కామారెడ్డి జిల్లా నుంచి వచ్చిన తహసీల్దార్ సతీష్ రెడ్డి ను డిచ్పల్లి మండలం,అలాగే జగిత్యాల జిల్లా నుంచి వచ్చిన ముంతాజ్బుదిన్ ను ముప్కాల్, జీ.ప్రసాద్ ను కమ్మర్పల్లి మండలంలో,వీర్ సింగ్ ను చందూర్ తహసీల్దార్ గా, నియామకం చేశారు.
అలాగే వర్ని మండలం తహసీల్దార్ గా పని చేసిన వెంకటేశం ను డీఏఓ,రెవెన్యూ కార్యాలయానికి, కే.ధన్వాల్ ను కలెక్టరెట్లో సూపరింటెండెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరూ వెంటనే ఆయా స్థానాల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
