నగరంలో మున్సిపల్ కమిషనర్ అత్యవసర తనిఖీలు. నగరంలో అకాల వర్షంతో రోడ్లపై నిలిచిపోయిన నీటిని వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు ఆదేశించారు.
బుదవారం రాత్రి నగరంలో భారీ వర్షం కురిసిన తర్వాత, కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై మరియు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది.దీంతో నగరంలోని జోన్-IV పరిధిలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తెల్లవారుజామున పలు చోట్ల అత్యవసర తనికీలు నిర్వహించారు.
నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్, ఆదర్శ్ నగర్, కలెక్టరేట్ బైపాస్, గుమస్తా కాలనీ, శ్రద్ధానంద్ గంజ్, అన్ని నిజామాబాద్ కాలనీ గంజు వెజిటబుల్ మార్కెట్, రైల్వే ట్రాక్ నుండి అర్సపల్లి రైల్వే ట్రాక్, బోధన్ రోడ్, R&B కల్వర్ట్, D-54 కెనాల్, & D-52 కెనాల్ వంటి వర్షపాతం, వర్ష ప్రభావ ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు.
నీరు నిలిచి ఉన్న వివిధ ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. పట్టణం అంతటా పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని కమిషనర్ ఇన్‌ఛార్జ్ I/C ఏం హెచ్ ఓ, శానిటరీ సూపర్‌వైజర్లను ఆదేశించారు.
ఇంటింటికీ చెత్త సేకరణ, చెత్త ప్రదేశాల నుండి చెత్తను ఎత్తడం, కాలువలను శుభ్రం చేయడం, సిల్ట్‌ను ఎత్తివేయడం, చెత్త మరియు సిల్ట్ సేకరించిన చోట బ్లీచింగ్ పౌడర్ చల్లడం, షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా దోమల నివారణ మందు పిచికారీ చేయడం మరియు ఫాగింగ్ చేయడం, తప్పనిసరిగా చేయాలని సూచించారు.
డెంగ్యూ, మలేరియా, న్యుమోనియా వంటి ప్రమాదాల నుండి నగర ప్రజలను రక్షించడానికి నగరాన్ని చక్కగా మరియు శుభ్రంగా ఉంచాలని కమిషనర్ పారిశుధ్య విభాగానికి ఖచ్చితంగా ఆదేశించారు.
ఇంజనీరింగ్ విభాగం కమిషనర్ అన్ని ఇంజనీరింగ్ వింగ్‌లు & శానిటేషన్ వింగ్‌తో లోతట్టు ప్రాంతాలు మరియు నాలాలను గుర్తించి, నీటి ప్రవాహాన్ని సులభంగా కోసం జేసీబీ ద్వారా తవ్వాలని, నిలిచిపోయిన నీటిని పర్యవేక్షించాలని,నిలిచిపోయిన ప్రాంతాల నుండి నీటిని శుభ్రంగా తీయాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో మున్సిపల్ EE గారు, I/C మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, అన్ని మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు, శానిటరీ సూపర్‌వైజర్ & శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
