HomePOLITICAL NEWSArmoorబాలింత మహిళ అనుమానాస్పదలో మృతి

బాలింత మహిళ అనుమానాస్పదలో మృతి

ఆర్మూర్ పట్టణంలోని వడ్డెర కాలనీలో రెండు నెలల బాలింత మహిళ అనుమానాస్పదంగా బుధవారం ఉదయం మృతి చెందింది స్థానికుల వివరాల ప్రకారం బాలింత మహిళ పూజ 27 సంవత్సరాలు భర్త కి వెళ్లి మూడు నెలలు అవుతుందన్నారు

మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో అత్తమ్మ మరియు పూజ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు అత్త మరియు ఆడబిడ్డ కలిసి పూజను హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని ఘటనాన్ని పరిశీలించారు స్థానికులు పూజ అత్తమ్మ మరియు ఆడ బిడ్డపై దాడి చేయడానికి ప్రయత్నించారు

ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలను రప్పించి ఎటువంటి గొడవలు కాకుండా ప్రయత్నించారు

అనంతరం అమృతరాలైన పూజ పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అత్త మరియు ఆడబిడ్డను అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments