HomeCRIMEటార్గెట్ ఒత్తిడితో మనస్తాపం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పోస్టు మెన్

టార్గెట్ ఒత్తిడితో మనస్తాపం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పోస్టు మెన్

విధి నిర్వహణ లో టార్గెట్ లఒత్తిడిని తట్టుకోలేక ఓ పోస్టు మెన్ ఆత్మ హత్యకుసిద్ధ పడ్డాడు .నగరంలోని తపాలా శాఖలో ఘటన కలకలం రేపుతోంది.

ఆలూర్‌కు చెందిన గంగాధర్ అనే పోస్ట్మన్ తనపై పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, సేవింగ్స్ అకౌంట్స్ లక్ష్యాలు పూర్తిచేయాలని అధికారం ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించాడు.

ఈ పరిస్థితిని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని, ఈ నేపథ్యంలో ఓ వీడియో విడుదల చేసినట్లు తెలుస్తోంది.

అనంతరం, ఆలూర్‌లోని తన పొలంలో పురుగుల మందు తాగిన గంగాధర్‌ను స్థానికులు గమనించి వెంటనే ఆర్మూరులోని ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments