నిజామాబాద్ నగరంలో శనివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ టౌన్-1, 2, 3 ADE లు చంద్రశేఖర్, ప్రసాద్ రెడ్డి, వీరేశంలు తెలిపారు.
మరమ్మతుల కారణంగా పవర్ హౌస్, మిర్చి కాంపౌండ్, వినాయక్ నగర్, బోర్గం, దుబ్బ, ముబారక్ నగర్, అర్సపల్లి, హమాల్వాడి, ఎల్లమ్మ గుట్ట, పోలీస్ లైన్, ప్రభుత్వ ఆసుపత్రి, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు.
